నోరూరించే సంప్రదాయ వంటలు తయారు చేస్తున్న మహిళలు..
రామాయంపేట : సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మల తో పాటు ప్రధానంగా ప్రతి ఇంటా ఘుమ..ఘుమలాడే పిండివంటలు. సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తు.సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు… ప్రధానంగా ప్రతి ఇంటా ఘుమ.. ఘుమలాడే పిండివంటలు, సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. పూర్వీకులు నిర్ణయించిన 1 సంప్రదాయక వంటలే అయినప్పటికీ వాటిలో పోషకాలు అత్యధికమని వైద్యనిపుణుల అభిప్రాయం. సంక్రాంతి పండగ శీతాకాలంలో వచ్చే అతి పెద్దపండగ.
అరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి పురులు కట్టుకుని రైతులు నిల్వ చేసుకుంటారు. శీతాకాలంలో తీసుకునే ఆహారమే అత్యధిక శక్తిని అందిస్తూ మనిషికి ఏడాదిపాటు శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తుంది.అందుకే కొత్త బియ్యంతో చేసిన రకరకాల పిండివంటలు ఈ పండగలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ వంటకాలన్నీ శరీరానికి శక్తిని ఇవ్వడంతో ఉష్ణం పెంపొందించుకోవడానికి దోహదపడతాయి. సంక్రాంతి సంప్రదాయ పిండివంటల ప్రాశస్త్యం అది. దీంతో ప్రతీ ఒక్క ఇంట్లోనూ పిండివంటలు చేసుకుంటారు. ఇందులో ఎక్కువగా సకినాలు, జంతికలు, నువ్వుల ఉండలు, సున్ని ఉండలు.. ప్రాంతాలను బట్టి చాలా మంది ఇతర వంటలను కూడా చేస్తుంటారు. కానీ, వీటినే ఎక్కువమంది చేసుకుంటారు.