మాదిగల ఏబిసిడి వర్గీకరణకు అడ్డుపడితే సహించేది లేదు – సాయిలు

-ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సాయిలు మాదిగ

సిరి న్యూస్ జనవరి 19 హత్నూర: మాదిగల ఏబిసిడి వర్గీకరణకు అడ్డుపడితే సహించేది లేదని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సాయిలు మాదిగ హెచ్చరించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రామ్మూర్తి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగల ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలిపే వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కొందరు స్వార్ధపరులే ఏబిసిడి వర్గీకరణకు అడ్డుపడుతున్నారని అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వర్గీకరణ తథ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ కళాకారులు కవులు ఎమ్మార్పీఎస్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.