అంధుల అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలి 216వ జన్మదిన వేడుకలు

దివ్యాంగుల ప్రజావాణి కి 14 దరఖాస్తులు – జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

ఈనెల 8న దివ్యాంగుల కొరకు ప్రత్యేక జాబ్ మేళా … జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

జనవరి 4 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖఆధ్వర్యంలో అంధుల అక్షర ప్రదాత లూయీ బ్రెయిలీ 216 వ జన్మదిన (Louis Braille 216th Birthday Celebrations) వేడుకలు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు (sangareddy collector Valluru Kranthi) హాజరై కలెక్టరేట్లోని లూయీ బ్రెయిలీ విగ్రహానికి పూలలంకరణ గావించి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..లూయి బ్రెయిలీ తనకు అంధత్వం వచ్చిందని బాధపడకుండా అంధులు చదువుకోడానికి వీలుగా ప్రత్యేక లిపిని కనుగొన్నారని అన్నారు. బ్రెయిలి లిపి ద్వారా అంధులు చదవగలగటం ప్రారంభించి, తమ జీవితాల్లో స్వావలంబన సాధించారు. బ్రెయిలి లిపి ఆధారంగా కంప్యూటర్లలో బ్రెయిలి స్క్రీన్ రీడర్‌లు, టచ్ స్క్రీన్ బ్రెయిలి పరికరాలు అభివృద్ధి చెందాయని తెలిపారు . బ్రెయిలి లిపి ఒక సింపుల్ కాన్సెప్ట్ అయినా, అంధుల చదవడం, వ్రాయడం, విద్యను స్వేచ్ఛతో పొందడంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఈ లిపి 6 బిందువుల ఆధారంగా రూపొందించబడింది, ఇది అక్షరాలు, సంఖ్యలు, సంగీతం వంటి వివిధ అంశాలను సులభంగా ప్రదర్శించగలుగుతుంది. బ్రెయిలీ లిపి ఆధారంగా ఎంతోమంది అంధులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు . సివిల్ సర్వీసులల్లో ర్యాంకులు సాధించి కలెక్టర్లు అవుతున్నారని గుర్తు చేశారు . అంధులు సామాన్యులకు కూడా తీసిపోకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంధులు అందరూ తమ వైకల్యాన్ని మరచి, మనోధర్యంతో పట్టుదల వదలకుండా కృషిచేసి విజయం సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. జిల్లాలో అందులో కోసం ప్రత్యేకంగా సౌండ్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు .

లూయిస్ బ్రెయిలి అందరికి మార్గదర్శనం, అంధుల పట్ల శ్రద్ధ, అభిరుచి ,సేవా భావంతో చేసిన పనులు మనందరికీ స్ఫూర్తి. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి తన లక్ష్యాన్ని చేరుకునే శక్తి నిచ్చింది. లూయిస్ బ్రెయిలి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి అంధుల హక్కుల కాంతి వంతమైన చిహ్నంగా నిలుస్తుందని , లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకలు సందర్భముగా అంధులకు జ్ఞాపకం అందజేశారు. అనంతరం బ్లైండ్ స్టిక్స్ ను పంపిణీ చేశారు. జిల్లాలోని దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి ప్రతి నెల మొదటి శనివారం ప్రత్యేక ప్రజావాణిని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా శనివారం నిర్వహించిన ప్రజావాణిలో 14 దరఖాస్తులు అందాయని తెలిపారు. అందులో పెన్షన్ల కొరకు, ఉపకరణముల కొరకు దరఖాస్తుల అందాయని తెలిపారు .

ఈ ప్రత్యేక ప్రజావాణి దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికై ఇక నుండి ప్రతి నెల మొదటి శనివారం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దివ్యాంగుల కొరకు ప్రైవేట్ రంగంలో జాబులు కొరకు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ఆడిటోరియంలో యందు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా లోని నిరుద్యోలైన దివ్యాంగులు తగిన విద్యార్థులు గల దృపత్రాలతో హాజరై ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు . ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, జడ్పి సీఈవో జానకి రెడ్డి , జిల్లా సంక్షేమ అధికాణి, శ్రీమతి కె లలిత కుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అనిల్ కుమార్, జిల్లా అంధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్. ప్రవీణ్ కుమార్ ,ఏ లక్ష్మణ్ , కే మహేష్ ,జ్ఞానేశ్వర్ , విట్టల్, జుబేదా, రాంశెట్టి , తదితరులు పాల్గొన్నారు.