సంగారెడ్డి : ప్రముఖ న్యాయవాది మహమ్మద్ నిజామోద్దీన్ రషీద్ సంగారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్లో ఉన్న గ్రంథాలయానికి నూతన క్రిమినల్ మేజర్ చట్టాలు అయిన భారతీయ న్యాయ సంహిత ( BNS), భారతీయ నాగరిక సురక్షా సంహిత ( BNSS ), భారతీయ సాక్ష్యముల చట్టము ( BSA ) మరియు వీటితోపాటు భారత రాజ్యాంగం ( Constitution of Indian ) యొక్క నూతన పుస్తకాలను బార్ అసోసియేషన్ గ్రంథాలయం కోరకు గ్రంథాలయ కార్యదర్శి అంజనేయులు గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది మహమ్మద్ నిజామోద్దీన్ రషీద్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు మన సమాజంలో చాల ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. గ్రంథాలయాల ఏర్పాటు కొరకు ఒకప్పుడు ఉధ్యమాలు జరిగాయి. మన సంగారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్లో ఉన్న గ్రంథాలయం చాల విశాలంగా మరియు అమూల్యమైన పుస్తకాలతో నిండి ఉంది.
పుస్తకాలతోపాటు కంప్యూటర్, ఇంటర్నేట్ మరియు వైఫై సౌలభ్యం కూడా ఉంది. ప్రతి రోజు అధిక సంఖ్యలో న్యాయవాదులు తమ వృత్తి పరమైన పుస్తకాలను చదువుకుంటూ మరియు కంప్యూటర్లను ఉపయోగించుకుంటు ఉంటారు. “నా దృష్టిలో గ్రంథాలయాలు జ్ఞానప్రాప్తి భాండాగారాలు”, గ్రంథాలయాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని తెలిపారు. ఈ సందర్భంగా కందుకూరి విరేశలింగం పంతులు గారు చెప్పిన సూక్తి ” చిరిగిన చొక్కా అయిన తోడుక్కొ కాని ఒక మంచి పుస్తకం కోనుక్కో ” అని గర్తుచేశారు. గ్రంథాలయాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు. నేడు మన గ్రంథాలయానికి నాకు తోచిన సహాయం చేస్తున్నాను, గతంలో కూడా చేశాను మరియు భవిష్యత్తులో కూడా మన గ్రంథాలయానికి నాకు తోచిన సహాయం చేస్తాను అని తెలిపారు. ఈ కార్యాక్రమంలో న్యాయవాది మహమ్మద్ నిజామోద్దీన్ రషీద్, గ్రంథాలయం కార్యదర్శి అంజనేయులు, న్యాయవాదులు రంజిత్, మనోహర్, రాజశేఖర్, వెంకటేష్, శ్రీనివాస్, భాస్కర్, సుభాష్ చందర్, రవి కుమార్, దత్తాత్రి, అదిల్, శ్రీకాంత్, తులసిరాం, చందర్ నాయక్, విశ్వంబర్, రామకృష్ణ, చిత్ర, మహేశ్వరి మరియు తదితరులు పాల్గోన్నారు.