చలో హైదరాబాద్‌ను విజ‌య‌వంతం చేయాలి

రామయంపేట జనవరి 8 సిరి న్యూస్ : మెదక్ జిల్లా రామాయంపేట (Ramayapet) మండల కేంద్రంలో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం రోజు విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ల కు ఉప వర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డప్పులు – వెయ్యి గొంతులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉమ్మడి రామాయంపేట,నిజాంపేట మండలాల ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీలలో ఉన్న 59 మాదిగ ఉప కులాల నాయకులు హైదరాబాదులో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మసాయిపేట యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు మల్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.