కేంద్రీయ విద్యాలయానికి భూసేకరణ – కలెక్టర్ రాహుల్ రాజ్

అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలి
కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశాలు

మెదక్ ప్రతినిధి , ఫిబ్రవరి 05 (సిరి న్యూస్) : జిల్లాలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం కొరకు అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం నాడు మెదక్ మండల పరిధిలో పాతూరులో ఆర్డిఓ రమాదేవి, ఎమ్మార్వో లక్ష్మణ్ లతో కలిసి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతూరులో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టేందుకు భూమిని గుర్తించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, సంబంధిత నివేదికలు తయారుచేసి వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.