మెదక్ టౌన్ ఫిబ్రవరి 2 (సిరి న్యూస్) : ఎస్సీ ఏబిసిడి ల వ్యతిరేకుల పై కక్ష సాధింపు చర్యలు రాజకీయపరం గా మాదిగలు ప్రతీకారం తీర్చుకుంటారని శనివారం నాడు ఎమ్మార్పిస్ బాద్యులు స్థానిక ఐబిలో ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. చిట్ట చివరి మాదిగ ఉపకులాలకు రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు ప్రతి పేద వాళ్లకు అందాలని ఆకాంక్షిస్తున్నారు.
ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా మాదిగ, ఇతర ఎస్సీ కులాలకు తీరని ద్రోహం, మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో లక్ష డప్పుల ‘లాంగ్ మార్చ్’ జరగబోతున్నదని ఇది ప్రపంచచరిత్ర లో మునుపెన్నడూ జరగని అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం అని, మాదిగలు ఇతర ఎస్సీ కులాలు డప్పులు, ఇతర వాయుద్యాలతో సిద్దం కావాలని అన్నారు.
ప్రతి గ్రామ మండల పల్లె నుండి ప్రతి మాదిగ బిడ్డ దప్పేసుకుని తల్లి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మాసాపేట యాదగిరి చెట్లపల్లి యాదగిరి ఉషన్న గళ్ళ మురళి ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అస్తరు గళ్ళ బాలరాజ్. దండోల సామేలు మహిళా నాయకులు మాధవి, పవన్, గట్టయ్య, యాదగిరి, ప్రతాప్, సాంసంగ్ లు పాల్గొన్నారు.