కేటీఆర్ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్ జనవరి 16 (సిరి న్యూస్) : ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ అరెస్టును అక్రమమైన అరెస్టుగా, రాజకీయాల కక్ష సాధింపుగా చర్యలుగా పేర్కొంది . నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో హైదరాబాదులో ఫార్ముల రేసు నిర్వహించడానికి శత విధాలుగా ప్రయత్నం చేసిన ఫలించలేదు.

కేటీఆర్ వలన హైదరాబాదుకు ఈ రేసు రావడంవలన తెలంగాణకు మంచి పేరు వచ్చిందని ఆ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అరెస్టు చేస్తున్నారని చెప్పారు. అవినీతికి సంబంధించిన సరైన ఆధారాలు కాంగ్రెస్ చూపకుండా అరెస్టులు చేస్తున్నారు అరెస్టులకు ఎవరు భయపడరని కేటీఆర్ పై పెట్టిన కేసులు ఎవరు నమ్మరని వ్యక్తం చేశారు.