ఎమ్మెల్యే మొదలు రాజకీయ నైతిక విలువలు తెలుసుకో – చింతల కరుణాకర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల కరుణాకర్ రెడ్డి

శివంపేట్ (సిరి న్యూస్) జనవరి 29 : ఎమ్మెల్యే సునీతా రెడ్డి కుర్చీకోసం ఆరాటపడే మీరు చిల్లరగాండ్లతోని పెద్ద నాయకుడిని తిట్టిచ్చినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదనీ, ఆకాశం మీదకు ఉమ్మివేస్తే, ఆది మీ మీదే వచ్చిడుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల కర్ణాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని కొంతాన్ పల్లి గ్రామంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన, గెలిచిన నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి ఆవుల రాజిరెడ్డి, అటువంటి నాయకుడిపై ఎమ్మెల్యే సునీతా రెడ్డి, ఆమె చెంచాలు వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంత వరకు సమంజసమని కర్ణాకర్ రెడ్డి ప్రశ్నించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి దర్జాగా పదవులు అనుభవిస్తూ, ప్రజలకు ఏమిసేవ చేశారని ఆయన అన్నారు.

ప్రజలకు రుణమాఫీ గాని, ఒక రేషన్ కార్డు గాని, ఇండ్లు గాని మీరు ఇప్పించారా, ప్రభుత్వం మీద పొరడలేని చేతగాని దద్దమ్మల వలె వేదికల మీద కుర్చీ కోసం చిల్లర పంచాయతీలు పెట్టుకుని తన్నుకు చచ్చారు తప్ప, ఏ ఒక్క రోజు ప్రజల కోసం ఆరాట పడి పనిచేసిన దాఖలాలు లేవన్నారు. న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన ఆవుల రాజిరెడ్డికి ప్రభుత్వ నియమ నిబంధనలు, ప్రోటోకాల్ గురించి మీతో చెప్పించుకోవలసిన దుర్గతి ఆయనకు పట్టలేదన్నారు. ఇప్పటికైనా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, రాజిరెడ్డి పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ వారు గ్రామాల్లో తిరుగుతే దాడులకు వస్తామని, పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా మీరాజనీతి ఏంది, మీ రాజకీయ నైతిక విలువలు ఏ పాటీవో ప్రజలకు అర్థమవుతున్నాయని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారన్నారు.

నాయకత్వం అంటే, రాజకీయాలు అంటే, పదిమంది మన్నించగలగాలంటే, విలువలతో కూడిన రాజకీయాలు నేర్చుకోవాలి అంతేతప్ప, దాడులకు దిగుతాం, చూసుకుందాము అనే లొట్టఫిసు మాటలు బంద్ చేయాలని కరుణాకర్ రెడ్డి హితావు పలికారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మీ నాయకులకు మొదలు విలువలతో కూడిన రాజకీయాలు నేర్పించండి, చిల్లరమల్లర ప్రకటనలు వారిచేత ఇప్పించి, మీ స్థాయిని దిగదార్చుకోవద్దని కర్ణాకర్ రెడ్డి సూచించారు. మీ పార్టీ నాయకులను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి, కింది స్థాయి వ్యక్తులతో తిట్టించినంతమాత్రాన సూర్యుడి వంటి రాజిరెడ్డి కీ ఏమీ కాదన్నారు.