
నారాయణఖేడ్ జనవరి 31 (సిరి న్యూస్) హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గంలో శుక్రవారం, తెలంగాణ ప్రభుత్వం వందేళ్ళ చరిత్రను తిరగరాస్తు పేదల పెద్దాసుపత్రి కొత్త ఉస్మానియా దావకానను గోషామహల్ లో 26,ఎకరాల విస్తీర్ణంలో,2000 పడకల సామర్థ్యంతో, అత్యాధునిక వైద్య సాంకేతికతో, కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే విధంగా కొత్త ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదరా రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, సహచర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.