ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన

చిలప్ చెడ్: కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని చిట్కుల్ కస్తూర్బా గాంధీ (గిరిజన) బాలికల విద్యాలయం పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజీబీ స్టేట్ కమిటీ మెంబర్ మధులత మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సంవత్సరానికి 27 సెలవులు, ఉద్యోగ భీమ కల్పించి న్యాయం చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులురాలు తదితరులు పాల్గొన్నారు.