ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (IIT), (కంది) ని సందర్శించిన కేరళ గవర్నర్, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు.
సంగారెడ్డి: ఐఐటీ క్యాంపస్‌లో గవర్నర్ పర్యటన సందర్భంగా అధ్యాపకులతో పాటు ఇతర అధికారులు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు .ఈ సందర్భముగా జిల్లా అభివృద్ధికి సంబంధించి ఐఐటీ తో భాగస్వామ్య అవకాశాల గురించి కలెక్టర్ వివరించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ నూతన పరిశోధనలు, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, ఐఐటీ నుంచి ప్రభుత్వ రంగ అభివృద్ధికి తోడ్పాటు వంటి విషయాలపై గవర్నర్‌కు వివరించారు. ఐఐటీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ లో అత్యాధునిక పరిశోధనలు, స్టార్టప్ సహకారాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాల గురించి గవర్నర్‌కు వివరించారు.
ముఖ్యంగా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఐఐటీ చేస్తున్న పరిశోధనలపై ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భముగా గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో ఐఐటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలి. ఆధునిక సాంకేతికత వినియోగంతో దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లు ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సహాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఐ టీ డైరెక్టర్, ప్రోఫిసర్ బి ఎస్ మూర్తి , అదనపు ఎస్పీ సంజీవరావు ,ఆర్డీఓ రవీందర్ రెడ్డి , డిఎస్పీ సత్తియ్య, కంది తహసీల్దార్ విజయలక్ష్మి ,డిటి మల్లయ్య , సంబంధిత అధికారులు పాల్గొన్నారు .