శివంపేట్ జనవరి 8 ( సిరి న్యూస్ ) : శివంపేట (Shivampet) మండలం రత్నాపూర్ లింగోజిగూడ గ్రామాలలో కాట్రోత్ సురేష్ (Kantroth SUresh) అనే వ్యక్తి 400 kv AE అని దాసరి బిక్షపతి గ్రామపంచాయతీ వర్కర్ దగ్గరికి వెళ్లి గ్రామంలో మీటిర్ లేని వారి ఇంటికి వెళ్దామని చెప్పి ఒక్కోమీటర్ కు 250 లు వసూలు చేశాడు. కొంతమందికి అనుమానం వచ్చి లైన్మెన్ కి ఫోన్ చేశారు. గత వారం రోజుల నుండి పలు గ్రామాలలో మీటర్ ఇప్పిస్తానని ప్రజలను మోసం చేశాడు.
గోదూరి సురేష్ కొత్తపేట్ లింగోజిగూడ రత్నాపూర్ లలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. నాకు జనవరి 5 నాడు 9347750241 ఈ నెంబర్ నుండి 400 కేవీ ఏఈ అని చెప్పి మీటర్ లేకుండా డొమెస్టిక్ సప్లై వాడుతున్నారు.. మీరు ఏం చేస్తున్నారు. నిన్ను సస్పెండ్ చేస్తానని బెదిరించాడు. అది ఫేక్ కాలనీ పట్టించుకోలేదు. తర్వాత బుధవారం నాడు ఉదయం గ్రామాలలో మీటర్ ఇప్పిస్తానని 250 రూపాయలు వసూలు చేస్తున్నాడని తెలిసింది.అతనిపై చట్టపరమైన చర్యతీసుకోవాల్సిందిగా శివంపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.