కల్వకుంట్ల కుటుంబం జైలుకెళ్ళడం ఖాయం..?

kalvakuntlas-family-is-sure-to-go-to-jail..?
kalvakuntlas-family-is-sure-to-go-to-jail..?

పది సంవత్సరాలలో రాష్ట్ర ఖజానను దోచుకున్నారు..
సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్..

సిద్ధిపేట : 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ రాష్ట్ర ఖజానాను లక్షల కోట్ల రూపాయల దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం మొత్తం త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సోమవారం సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నమ్మి పది సంవత్సరాలు అధికారం కట్టబెట్టారు అని అన్నారు.

ఇదే ఆసరాగా తీసుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం వివిధ పథకాల పేరిట లక్షల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే కాకుండా వారి స్వలాభం కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడిన నీ తండ్రి కెసిఆర్ నీ తర్వాత జైలుకు వస్తాడని అన్నారు. అర్హులైన కూలీలకు రైతులకు రైతు భరోసా అందిస్తుంటే మాజీ మంత్రి హరీష్ రావు ఓర్వలేక పోతున్నారని అన్నారు.అధికారం కోల్పోయిన తర్వాత రైతుల పట్ల బిఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని 10 సంవత్సరాలలో వెనక్కి వెళ్లిన అభివృద్ధిని తిరిగి తీసుకు వస్తాడని అన్నారు.

సిద్దిపేటలో ప్రభుత్వ భూమి 1340 సర్వే నంబర్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బిఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి కబ్జాలు చేశారని అన్నారు. సిద్దిపేట లో ప్రభుత్వ భూములను కొందరు బి ఆర్ ఎస్ నాయకులు కబ్జాలు చేశారని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బిఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి కబ్జాలు అక్రమాలన్ని బయటపెడతానని అన్నారు. మీరు చేసిన అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కబ్జా చేసిన భూములన్ని స్వాధీనం చేసుకుని త్వరలోనే మీరు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరోసారి విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు.