ఓ పరిశ్రమకు కరెంటు పునరుద్ధరణ కోసం రూ .50 వేలు డిమాండ్…
పరిశ్రమ యజమానులతో రూ .30 వేలు ఒప్పందం…
అడ్వాన్స్ గా ఈనెల 18న రూ. 10 వేలు …
మరో రూ. 20 వేలు తీసుకుంటుండగా రెడ్ అండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…
మనోహరాబాద్ : ఓ పరిశ్రమకు విద్యుత్ పునరుద్ధరణ కోసం విద్యుత్ రూ . వేలు 50 డిమాండ్ చేయగా పరిశ్రమ యజమానులు రూ. 30 వేలకు వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అడ్వాన్స్ గా ఈ నెల 18న రూ. 10 వేలు అందజేశారు. మరో రూ. 20 వేలు సోమవారం తన కార్యాలయంలో ఏఈకి ఇస్తుండగా మెదక్ రేంజ్ ఏసీబీ డిఎస్పి సుదర్శన్, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్ తో పాటు అధికారులు వలపన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాల్ల కల్ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాళ్ళకల్ విద్యుత్ కార్యాలయ సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ కృష్ణ ఇటీవల కాళ్లకల్ శివారులో నెలకొల్పిన లక్కీ ఇండస్ట్రీస్ పరిశ్రమకు కరెంట్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుండి పరిశ్రమకు కరెంటు సరఫరాను పునరుద్ధరించాలని పరిశ్రమ యజమానులు ఏఈని కోరగా రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారని తెలిపారు. అంతగా ఇచ్చుకోలేనని రూ. 30 వేలకు యజమానుల నుండి ఏ ఈ భ్యారం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఈనెల జనవరి 18న అడ్వాన్సుగా రూ. 10 వేలు ఏఈకి అప్పజెప్పారు. మరో రూ. 20 వేలు సోమవారం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 22న పరిశ్రమ యజమానులు తమకు ఫిర్యాదు చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం మంగళవారం తన కార్యాలయంలో ఏఈకి పరిశ్రమ యజమానులు రూ. 20 వేలు లంచం ఇస్తుండగా వలపన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏఈ ని అదుపులోకి తీసుకొని కార్యాలయంలో రికార్డులు, కంప్యూటర్ రికార్డులు తనిఖీలు నిర్వహిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.
లంచావతారులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి..
విద్యుత్ ఏఈ కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్యాండ్ గా పట్టుకోవడంతో ఈ ప్రాంతంలో మిగతా శాఖల అధికారులు అలర్ట్ అయ్యారు. మండలంలో ఉన్న మరి కొంతమంది అధికారులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించి లంచావతారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా కాళ్ళకల్ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం కావడంతో దేశంలోని నలుమూలల నుండి పరిశ్రమలలో పనిచేయడానికి కార్మికులు వస్తున్నారు. వారు నివాసము ఉండడానికి గ్రామంలో నివాస గృహాలు నిర్మించుకుంటున్నారు. ఆ గృహాలకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు కోసం ప్యానల్ బోర్డు లు అవసరం ఉన్నందున ఒక్కో ఫ్యానాల్ బోర్డ్ కు లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు విద్యుత్ అధికారులు డిమాండ్ చేస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటికి మీటర్ ఏర్పాటు కోసం రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వీటిపై కేసీబీ అధికారులు దృష్టి సారిస్తే మరింత మంది లంచాలు తీసుకునే అధికారులు పట్టుబడతారని గుర్తు చేస్తున్నారు.