అవిశ్రాంత పోరాట యోధుడు ఫూలే 

– బిసి సంక్షేమ సంఘం మండలాద్యక్షుడు శ్రీశైలం

హత్నూర : సమసమాజ స్థాపన కోసం జ్యోతి రావు ఫూలే అలుపెరుగని పోరాటం చేశారని బిసి సంక్షేమ సంఘం మండలాద్యక్షుడు శ్రీశైలం అన్నారు.మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో గురువారం బిసి సంక్షేమ సంఘం, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆ మహనీయుడి చిత్ర పటానికి పూష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారని వారు గుర్తు చేశారు.తరతరాలుగా సమాజంలో బలంగా వేళ్లూనుకున్న పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరించి స్ర్తీలకు విద్యనందించడం కోసం మొట్టమొదటి సారిగా పాఠశాలను ఏర్పాటు చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘసంస్కర్త ఫూలే అని వారు కొనియాడారు.

ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచి కొన్యాల వెంకటేశం,శాంతయ్య,మారుతి,ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.