కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన మ‌ల్లారెడ్డి

మనోహరాబాద్, జనవరి 6 సిరి న్యూస్ : బిఆర్ఎస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం మండలంలోని కాళ్ళ కల్ గ్రామానికి చెందిన మైనార్టీ నాయకుడు మమ్మద్ జాకీర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిటుకుల మైపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డిగా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మైపాల్ రెడ్డి కోరారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని జాకీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు నవీన్ , నాయకులు ఎరుకల నరసింహ, మండల మైనార్టీ అధ్యక్షులు జావిద్ పాషా ,ఇర్ఫాన్, దండు రమేష్ ముదిరాజ్, కనిగిరి అమరేందర్, కనిగిరి నరసింహ, ఇస్తారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.