ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే తెరమీదకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశం
ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగితే త్వరగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలి
మంత్రులు కస్తూర్బా ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనలపై స్పందించకపోవడం దారుణం
కస్తూర్బా ఉద్యోగులను చర్చలకి పిలిచి ప్రభుత్వం మాట్లాడాలి
సీపీఎం పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రెస్ మీట్
సంగారెడ్డి, జనవరి 3 సిరి న్యూస్ : రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికల (Jamili Elections) కోసం బీజేపీ యత్నిస్తోందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఒకే దేశం ఒకే ఎన్నికని బిజెపి తీసుకువస్తుందన్నారు. పార్లమెంట్ లో జమిలి బిల్లు పాస్ కాదని విషయం తెలిసినా హైలెట్ కావడం కోసమే బీజేపీ ప్లాన్ చేస్తుందన్నారు. ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగితే త్వరగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
జిమ్మిక్కుల కోసమే సావిత్రి బాయి పూలే జయంతి(Savitri Bai Phule Jayanti)ని ఉమెన్ టీచర్స్ డే గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మంత్రులు కస్తూర్బా ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్నారు. పంజాబ్ లో గత 39 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారన్నారు. దలేవాల్ అనే రైతు నాయకుడు ఆస్పత్రిలోను నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనలపై స్పందించకపోవడం దారుణమన్నారు. 2022లో జరిగిన ఉద్యమం సందర్భంగా కనీస గిట్టుబాటు ధర ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన ఎటువంటి ఉలుకుపాలుకు లేదన్నారు. కస్తూర్బాగాంధీ ఉద్యోగులు గత 25 రోజులుగా ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్ లపై దృష్టి సారించాలన్నారు. కస్తూర్బా ఉద్యోగులను చర్చలకి పిలిచి ప్రభుత్వం మాట్లాడాలన్నారు.