
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్..
సంగారెడ్డి : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హుల అందరికీ చేరెలా చూడాల్సిన బాధ్యత అధికారుల దేనిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఇంటిగ్రెటెడ్ కలెక్టరెట్ కార్యాలయాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు .ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలులో వర్గ, కుల, మత బేధాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాసామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,మాధురి,జిల్లా అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.