సంగారెడ్డి, ఫిబ్రవరి 6 ( సిరి న్యూస్ ) : తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్ఓఏ) క్యాలెండర్‌ను గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, టీఎన్ఓఏ జిల్లా అధ్యక్షురాలు ఏ. లక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ కె. సుమలత, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.డి. ఇమ్రాన్ అలీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఆర్‌ఎంఓ ఆంజనేయులు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సందీప్, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ స్నేహ జిగిషా, అడిషనల్ డైరెక్టర్ విజయ శాంతి, నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మ, టీఎన్ఓఏ కార్యదర్శి ఆర్. నాగేందర్, సహాయ కార్యదర్శి ఆర్. సురేష్, కోశాధికారి ఎం. సంగ్రామ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఎ. గోపాల్, ఈసీ సభ్యులు కె. జ్యోతి, ఎం.డి. షఫీ, పి. సుధాకర్ రెడ్డి, పి.జి. మన్మోహన్, సిహెచ్. నరేష్ తదితరులు పాల్గొన్నారు.