ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం

సిద్దిపేట, జ‌న‌వ‌రి 12 సిరి న్యూస్ : సిద్దిపేట ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రమేష్, జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడు తమంగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి ఫుట్బాల్ కోచ్ అక్బర్ నవాబ్ క్రీడాకారులను పరిచయం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆట కు క్రెజ్ ఉందని అన్నారు.

పిల్లలను ఫుట్బాల్ ఆడడం ప్రోత్సహం ఇస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గత ఎనిమీదేళ్లుగా ఓక సంకల్పంతో ఫుట్బాల్ గ్రౌండ్ లో పిల్లలకు కోచింగ్ ఇస్తున్నామని సిద్దిపేట నుండి 4 ఫుట్బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ లోఅలాగే నలుగురు మహిళా ఫుట్బాల్ క్రీడాకారులు కూడా జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ లో అవకాశం లభించిందన్నారు. భవిష్యత్తు లోసిద్దిపేట నుండి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ టీం లో అదే విధంగా ప్రయత్నం చేస్తామని సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యాదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ తెలిపారు. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హరిశ్, జాయింట్ సెక్రటరీ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.