తెలంగాణ అంటే బిజెపి ప్రభుత్వానికి చిన్న చూపు- సువాసిని రెడ్డి
నర్సాపూర్ ఫిబ్రవరి 3 (సిరి న్యూస్)
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో తెలంగాణ కు అన్యాయం జరిగిందని బడ్జెట్ లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బడ్జెట్ కు వ్యతిరేకంగా సోమవారం నర్సాపూర్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించింది అనంతరం నర్సాపూర్ చౌరస్తాలో మానవ హారంగా ఏర్పడి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో అంకెలను చూసి చిన్న పిల్లవానికి కూడా అర్థం అవుతుందని తెలంగాణకు రావలసిన వాటా రాకుండా తుంగలో తొక్కేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున ప్రభుత్వాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి బడ్జెట్ కేటాయించడంలో వివక్షత చూపారు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెలంగాణలో వస్తుందని బిజెపి టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కావాలని డ్రామాలు చేస్తున్నాయి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ అన్యాయం గురించి ప్రజలలో తీసుకెళ్తామని అన్నారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సువాసిని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వృద్ధి రేటు 5. 1 గా ఉంటే దానిలో సగం 2.1 వాటాను కూడా కేటాయించలేదని తెలంగాణ ప్రజలు అంటే చులకనగా చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేశం వివిధ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యకర్తలుపాల్గొన్నారు.