సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి(pothireddypalli) హిందూ స్మశాన వాటికలో సమస్య లను పరిశీలించిన ఫోరమ్ నాయకులు ఈ సందర్బంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి స్మశాన వాటికకి పోతిరెడ్డిపల్లి హోసింగ్ బోర్డు కాలనీలు, రెడ్డికాలనీ, విద్య నగర్, బ్యాంకు కాలనీ, 10,11,12 వార్డు లకు చెందిన ప్రజలు అంత్యక్రియలు చేయడానికి పోతిరెడ్డిపల్లి స్మశాన వాటికకు వస్తారని, ఇక్కడ కనీసం నీటి వసతి, చీకటి పడితే లైటింగ్ సదుపాయాలు లేవని, ఉన్న చేతి పంపు బోర్ చెడి పోయిందని, హైమాస్ లైట్ ఉన్న పని చేయడం లేదని వెంటనే అధికారులు, ప్రజా ప్రతి నిధులు స్పందించి పోతిరెడ్డిపల్లి హిందూ స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసి, అంత్యక్రియలకు వచ్చే వారికీ నీటి వసతి, లైటింగ్ సౌకర్యం, రోడ్డు వసతి కల్పించాలని ఫోరమ్ ఫర్ బెట్టర్ సంగారెడ్డి డిమాండ్ చేస్తుందని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండురంగం, స్థానికులు మధు, పాండు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.