పేదరిక నిర్మూలన సంస్థ మహిళా స్వశక్తి భవన నిర్మాణ పనులను పూర్తిచేయలని అధికారులు
నిర్లక్ష్యంగా వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
పూర్తి చేయించాలని జగ్గారెడ్డికి మహిళా సంఘాల విన్నపం
సంగారెడ్డి జనవరి 2 సిరి న్యూస్ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకెపి – అర్బన్ ( మెప్మా) పురపాలక సంఘం సంగారెడ్డి మహిళా స్వశక్తి భవనం శంకుస్థాపన చేసి సరిగ్గా 13 సంవత్సరాలు గడుస్తున్నాయి. అప్పటి ప్రభుత్వ విప్ ( శాసనసభ సభ్యులు ) తూర్పు జయప్రకాశ్ రెడ్డి , 2012 లో అప్పటి ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శిలాఫలకాలికే అంకితం అయిపోయిన భవనాలను గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేకపోయింది.
ఇప్పటికైనా మహిళా శక్తి భవనం లోకి తెస్తే మహిళా సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పూర్తి కాకపోయినప్పటికీ బి ఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా కనీసం జిల్లా అధికారులు అయినా ఇటువైపు చూడకపోవడం గమనార్హం.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టిపిసిసి అధ్యక్షులు జగ్గారెడ్డి ఇప్పటికైనా గుర్తించి శిథిలమైన భవనాన్ని అందుబాటులోకి తెస్తారని మహిళా సంఘాలు తెలిపారు.
గ్రూపు సంఘాల సమావేశాలు జరుపుకోవాలని, మున్సిపాలిటీ లేదా మెప్మా ఆఫీసులో జరుపుకుంటున్నామని మహిళా సంఘాలకు ప్రత్యేకంగా భవనాన్ని ఏర్పాటు చేస్తే అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని సంగారెడ్డి జిల్లా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 13 సంవత్సరాల గడిచినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి ఇటువైపు వచ్చి చూసిన దాఖలాలు లేవని కనీసం ఇప్పటికైనా అధికారులకు ఆ భవనం ఉన్నట్టు వారికి గుర్తు ఉన్నదా లేదా అనే విషయం కూడా చెప్పడం విశేషం.అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా మహిళా స్వశక్తి భవనాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి.
ఆయుష్ భవనం శంకుస్థాపన ఎప్పుడు ?
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి గత సంగారెడ్డి మెడికల్ కాలేజ్ సందర్శించినప్పుడు అధికారులను ఆదేశించిన ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పటివరకు స్థల పరిశీలన అయ్యిందా కాలేదా తెలియదు. 15 రోజుల్లోనే స్థలాన్ని ఎంపిక చేస్తే శంకుస్థాపన చేస్తానని స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన విషయం విధితమే. అధికారులు మాత్రం మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని, ఆయుష్ శాఖ వారు కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం వారి పనితీరుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆయుష్ 40, పడకల ఆసుపత్రి 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి ప్రభుత్వ విప్ శాసనసభ సభ్యులు, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, ప్రారంభోత్సవం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల విభజన జరగడం, అది కాస్త సిద్దిపేటలో ఏర్పాటు కావడం జరుగుతుంది.
సంగారెడ్డిలో ఆయుష్ 40 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే జిల్లాలో ఆయుర్వేద, యునాని, హోమియో, నేచురోపతి, ప్రాచీన వైద్య విధానానికి సంబంధించిన ఆయుష్ ఆసుపత్రి హైదరాబాద్లోని ఎర్రగడ్డకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. స్థానికంగా ఆయుష్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తే సంగారెడ్డి జిల్లా వాసులకు, ప్రాచీన వైద్య విధానం అందుబాటులోకీ వస్తే సంగారెడ్డి జిల్లా వాసులకి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉండదని స్థానికంగా 40 పడకల ఆయుష్ ఆసుపత్రికి ఏర్పాటు చేయడం వల్ల ప్రాచీన వైద్య విధానాన్ని ఎంతోమంది ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారని ప్రజలు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే స్పందించి ఆయుష్షు 40 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వాసుల కోరికను నెరవేరుస్తారని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.