హత్నూర : నేడు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం డైరీని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిచే మినిస్టర్ క్వార్టర్స్ లో ఆవిష్కరించడం జరిగింది. మంత్రివర్యులకు ఎస్జిటియు రాష్ట్ర శాఖ పక్షాన ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడం జరిగింది. ఎస్జీటీ లకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకై అసెంబ్లీ లో తీర్మానం చేయాలని, ఇటీవల సంగారెడ్డి జిల్లాలో చిన్న చిన్న కారణాలతో ముగ్గురిని ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన విషయాన్ని విన్నవించగా మంత్రి స్పందిస్తూ.. ఈ విషయంపై అధికారులతో మాట్లాడతా అని తెలపడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం మరియు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ,ఎస్ జి టి యు గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి సంకినేని మధుసూదన్ రావు గారు మరియు రాష్ట్ర నాయకులు పద్మారెడ్డిగారు వివిధ జిల్లాల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఆకుల ప్రభాకర్, నిమ్మల కిష్టయ్య, జింక అశోక్ , గణేష్ , లాలయ్య, సంగారెడ్డి ,మెదక్ జిల్లా మహిళా అధ్యక్షులు అరికెల నలిని , స్వర్ణలత , మంజీర ,స్వర్ణ పాల్గొన్నారు