వైభవంగా మార్కండేయ మహర్షి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన…

నారాయణఖేడ్: ఫిబ్రవరి 1 )సిరి న్యూస్) పట్టణంలోని వెంకటాపూర్ చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న మహా మార్కండేయ మహర్షి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పద్మశాలి కుల బాంధవులు, పెద్దలు కలిసి ఏకశిలా ధ్వజారోహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి నెల మూడు నుండి ఆరో తేదీ వరకు నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి నియోజకవర్గ పద్మశాలి కుల బాంధవులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంతం, నర్సింలు, సంగన్న, రాఘవులు, గోస్కె శ్రీనివాస్, శివకుమార్, బాయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.