గుమ్మడిదల ప్యారా నగర్ లో డంపు యార్డ్ ను ఆపకపోతే పోరాటం ఉదృతం చేస్తాం – ఎమ్మెల్యే సునీత

ఫిబ్రవరి 6 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : గుమ్మడిదల ప్యారా నగర్ లోని డంపింగ్ యార్డ్ పనులు వెంటనే నిలిపివేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి బి ఆర్ ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ,సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 152 ఎకరాలలో డంపు యార్డు నిర్మాణాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

ప్యారా నగర్ లో డంపింగ్ యార్డ్ ను మరో లాగచర్ల ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.. బయట ప్రపంచానికి, తెలియని ఊరుగా ప్యారా నగర్ ఉండటంతో అక్కడ డంప్ యార్డ్ నిర్మించడం చాలా దారుణం అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలతో అరెస్టు చేసి డంప్ యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. పథకాలు అమలు అమలు చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చినప్పుడు డంపు యార్డుకు ఎన్నికల కోడ్ అడ్డు రాలేదా అని సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్యారా నగర్ మరో జవహర్ నగర్ గా మారబోతోంది. కోర్టు ఆర్డర్ ను కూడా ధిక్కరించి, వందల వాహనాలతో రాత్రికి రాత్రి డంపు చేయడం ఘోరం ప్రభుత్వ స్పందించి ఈ డంపియాడు నిలుపుదల చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.