ప్రజా పాలనలో సభలు కాలయాపన సభలు – కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం

సిద్దిపేట, జ‌న‌వ‌రి 21 సిరి న్యూస్ః తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సభలు, గ్రామసభలు, వార్డు సభలు అంటూ కాలయాపన చేసిన తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి.ఆర్.ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజా పాలన సభలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు ఇప్పటివరకు మంజూరు చేయకుండా.. పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ దరఖాస్తు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు.

ప్రజా పాలన, వార్డు సభలలో వచ్చిన ప్రతి దరఖాస్తులు ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు గాని, రేషన్ కార్డులో గాని అనర్హులుగా గుర్తించిన వారిని ఎందుకు అనర్హుల్గా గుర్తించారు అనేది సభలో చెప్పాలన్నారు. అనర్హులను అర్హులుగా, అర్హులను అనర్హులుగా ప్రకటించారని, వీటిని మార్చకపోతే బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మణిదీప్ రెడ్డి, పెర్క బాబు, సంతోష్ పలువురు పాల్గొన్నారు.