వెల్దుర్తి పట్టణ కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి బలరాం రెడ్డి..
వెల్దుర్తి: ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్న పేదల ఆర్థిక స్థితిగతులను పరిశీలించేందుకు, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పంచాయితీ కార్యదర్వి బలరాంరెడ్డి వెల్దుర్ది పంచాయితీ కార్యదర్శి బలరాం రెడ్డి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డులతో పాటు వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఖాళీ స్థలం ఉన్న వారికి మొదటి విడత లో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఇంటింటి సర్వే జరుపుతున్నట్లు తెలిపారు. సర్వేలో ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని వారికి , ఇండ్లు కూలిపోయిన వారికి, ఇల్లు శిథిలావస్థలో ఉన్న వారికి మొదటి విడతలో మంజూరు అయినవన్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు సర్వే చేస్తున్నామని, కావున సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి పట్టణ పంచాయతీ కార్యదర్శి బలరాం రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.