నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మా అంబి మహిళా సేవా సమితి సభ్యులు
బొల్లారం : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని బొల్లారం మున్సిపాలిటీ పరిధికి చెందిన (మా అంబి సేవా సమితి సభ్యులు) రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. కొత్త సంవత్సరంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా ముందుకు సాగాలని చంద్రారెడ్డి ఆకాంక్షించారు. చంద్రారెడ్డిని కలిసిన వారిలో సేవా సమితి అధ్యక్షురాలు దుర్గావతి దేవి , పరంశీలా , గీతా దేవి , ఆశ , సుమిత్రా , శివమణి ఉన్నారు, కార్యక్రమంలో స్థానిక నాయకులు దిననాద్ గారు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.