ప్రారంభించిన శ్రీ వెంకన్న మోటార్స్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి..
రామచంద్రాపురం : వరల్డ్ నంబర్ వన్ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త డెస్టీనీ 125 వాహనాన్ని గురువారం రాత్రి లాంచ్ చేసింది. రామచంద్రాపురం పరిధిలోని భీరంగూడ శ్రీ వెంకన్న మోటార్స్ షోరూమ్‌లో డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి కొత్త డెస్టినీ వెహికిల్‌ను కస్టమర్ల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అర్బన్ మొబిలిటీ రంగంలో కొత్త డెస్టినీ 125 విప్తవాత్మక మార్పలు తీసుకురాబోతోందని అన్నారు.
ఇండస్ర్టీ ఫస్ట్ ఫీచర్లతో అత్యధిక మైలేజీ ఇచ్చే విధంగా డెస్టినీ మార్పు చేయబడిందని, అన్ని వర్గాల కుంటుంభాలకు సౌలభ్యంగా, మోడర్న్ రైడింగ్ ప్రియులకు అనుగుణంగా డెస్టిని సుస్థిరతను సంపాధించుకోనుందని పేర్కొన్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ స్పీడో మీటర్, టర్న్ బై టర్న్, నావిగేషన్, ఈకో ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజ్ డిస్ప్లే, లో ఫ్యూయల్ సూచికలతో పాటు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, సులువుగా యాక్సెస్ చేసే విధంగా కాల్ రిజిస్టర్, ఇతర అలర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కొత్త డెస్టినీ 125 వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయని, వెంకన్న మోటార్స్ షోరూమ్‌లో కస్టమర్లు బుకింక్స్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ లాంచ్ కార్యక్రమంలో మేనేజర్ మహేందర్ రెడ్డి, సేల్స్ మేనేజర్ ధర్మతేజ, వెంకన్న మోటార్స్ సిబ్బంది పాల్గొన్నారు.