నాణ్యమైన పాల ఉత్పత్తితో ప్రజలకు ఆరోగ్యం -ఉమ్మడి మెదక్ జిల్లా ఈవో డాక్టర్ రాంజీ
హత్నూర, జనవరి 17 సిరి న్యూస్ః
పాడి పశువు రైతులు నాణ్యమైన పాల ఉత్పత్తితో ప్రజల ఆరోగ్యం ఉంటుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఈవో డాక్టర్ రాంజీ అన్నారు. హత్నూర మండల పరిధిలోని చింతలచెరువు గ్రామంలో పశు గుణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాడి పశువుల పాల ఉత్పత్తి పై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా ఈవో డాక్టర్ రాంజీ హాజరయ్యారు. పాడి పశువు రైతులు స్వచ్ఛమైన పాలను అందించి విజేతలుగా నిలిచారు. మొదటి బహుమతి వెంకట్ సాయి కుమార్, రెండవ బహుమతి శ్రీకాంత్, మూడవ బహుమతి వీరేశం లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పాడి పశువు రైతులు లేదా దూడలకు నెలకు ఒకసారి క్రమం తప్పకుండా ఆరుమాసాలు నట్టల నివారణ మందులు ఇవ్వడంతో నేటి దూడలే రేపటి పాడి పశువులుగా ఎదిగి రైతులకు ఆర్థిక భరోసానిస్తుందన్నారు. అనంతరం డాక్టర్ హేమలత మాట్లాడుతూ గోపాల మిత్రుల యొక్క సేవలు వినియోగించుకొని పాల ఉత్పత్తి మెరుగుపరుచుకోవాలని సమయానికి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్సిహెచ్ అర్జునయ్య, జి నాగేష్, బి సుధాకర్, మొయినుద్దీన్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.