నాలుగు పథకాల లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేత

-ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి

చిలిపిచేడ్,జనవరి26(సిరి న్యూస్) : మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26 నుంచి అమలు చేస్తున్న నాలుగు గ్యారెంటీలలో భాగంగా చిలిపిచేడ్ మండలంలో మండల కేంద్రమైన చిలిపిచేడ్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి లద్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.ఆదివారం పైలట్ ప్రాజెక్టు చిలిపిచేడ్ రైతు వేదిక (శీలంపల్లి)లో మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాల అమలును ప్రారంభించారు.

ఇందిరమ్మ ఇల్లు,రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పథకాలకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు.త్వరలో అన్ని గ్రామాల్లో ఆయా పథకాలు సంపూర్ణంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో (జిల్లా పౌర సరఫరా అధికారి)మండల ప్రత్యేకాక అధికారి సురేష్ రెడ్డి,నర్సాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి,మండల తహసీల్దార్ ముసాదిఖ్,డిప్యూటీ తహసీల్దార్ సింధుజ,ఎంపీడీఓ ఆనంద్,వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ ఎస్సై నర్సింలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.