ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Grand Republic Day celebrations.
Grand Republic Day celebrations.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పెండ అరవింద్.

అందోల్ : అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారత గణతంత్ర వేడుకలు. ఘనంగా జరిపించారు. ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. ప్రభుత్వ పాఠశాలల బాలబాలికలు చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు.

బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని, జాతీయ సమైక్యతా భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా పెండ అరవింద్ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెండ అరవింద్, ఉపాధ్యక్షులు తుడుం నవీన్ తుడుం అశోక్ బాలమణి, పోతారాజు విజయ్,తుడుం పాపయ్య, మోహన్,పోతారాజు ప్రభాకర్,మరియు అంబేద్కర్ సంఘ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.