ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Grand Republic Day celebrations..
Grand Republic Day celebrations..

హత్నూర: హత్నూర మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిదులు, నాయకులు,విద్యార్థిని విద్యార్థులు, యువకులు, ప్రజలు ఆదివారం పాల్గొని ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యలయం వద్ద తహశీల్దార్ ఫరీన్ షేక్, మండల పరిషత్ కార్యలయం వద్ద ఎంపీడీవో శంకర్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ వందనం చేశారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ చిన్నారులకు పెన్నులు, నోటు పుస్తకాలను అందజేసారు. అనంతరం భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా ఈ పండుగను ప్రజలు జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ దావూద్, ఎపిఏం దేవేందర్, ఆర్ ఐ శ్రీనివాస్. మాజీ ఎంపీపీ నర్సింలు, ఆయా శాఖల అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.