శుభాకాంక్షలు తెలిపిన శివ్వంపేట మండల బీఆర్ఎస్ ముఖ్యనేతలు
శివ్వంపేట జనవరి 06 సిరి న్యూస్ : మెదక్ మాజీ శాసనసభ్యులురాలు, ప్రస్తుత జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం నాడు శివ్వంపేట మండలానికి చెందిన ముఖ్య నేతలు హైదరాబాద్ నగరంలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
సోమవారం నాడు పద్మాదేవేందర్రెడ్డి జన్మదినం కావడంతో శివ్వంపేట మండల మాజీ ఎంపీపీ అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ,మండల పార్టీ అధ్యక్షులు వై.రమణ గౌడ్,ప్రచార కార్యదర్శి బుద్ధుల బిక్షపతి ,తదితరులు పద్మాదేవేందర్ ని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఎంపీపీ మాజీ అధ్యక్షులు హరికృష్ణ.మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్,ప్రచార కార్యదర్శి బుద్ధుల బిక్షపతి,ముఖ్య నేతలు కావడంతో ఆమె కాసేపు వారితో మాట్లాడారు,శివ్వంపేట మండలంలో పార్టీ పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.అందరూ కలిసి బిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కోసం శ్రమించారని వారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది.తాను త్వరలో శివ్వంపేట మండలానికి వస్తానని పార్టీ వ్యవహారాలపై ముఖ్య నేతలతో సమీక్షిస్తానని పద్మాదేవేందర్ రెడ్డి, వారితో అన్నారు.