జనవరి 21 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : సంగారెడ్డి మండల గ్రామ పంచాయతీ సభలు ప్రశాంతంగానే కొనసాగాయి. అక్కడ అక్కడ కొన్ని గ్రామాలలో లబ్ధిదారులకు వివరణ ఇచ్చే క్రమంలో లబ్ధిదారులకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోవడం లబ్ధిదారుల ఇబ్బంది పడడం కనిపించింది. మరి కొన్ని చోట్ల గ్రామసభల్లో జనాలు పూర్తిస్థాయిలో రాకపోయినా మధ్యాహ్నం వరకు ముగించేశారు. గ్రామపంచాయతీ జనాభాకు అనుగుణంగా గ్రామసభ ఏర్పాటు చేయాల్సిన అధికారులు అందులో నాలుగోవంతు కూడా రాలేకపోయారు. దీనిబట్టి అధికారుల కన్నా నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా గ్రామస్తులు కనిపించారు.
ప్రత్యేక అధికారుల పాలనలో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వ మాదేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో జనాలు రాలేకపోవడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క గ్రామసభలో కూడా సభ్యులు తృప్తిగా మాకు న్యాయం జరిగింది అనే విధంగా ఎవరూ చెప్పుకోలేకపోయారు. అన్ని సమస్యలుగానే చెప్తూ వచ్చారు. గ్రామ సభలో ఎక్కువ స్థాయిలో రేషన్ కార్డులు మార్పు చేర్పులు అలాగే కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఇస్తారేమో అనుకొని వచ్చాము అంటూ కొందరు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది… కేవలం అధికారులు లిస్టు చెప్పి ఎవరికి ఏమి ఏమి వచ్చాయి వివరాలు మాత్రమే చెప్పారు.
అంతేనా ఈరోజు రేషన్ కార్డులు ఇస్తామని మేము వచ్చాము, ఇంకెప్పుడు ఇస్తారు..ఫిర్యాదుదారులు
ఇలా అడగడంతో వారిని నచ్చ చెప్పడం అధికారుల వంతైందని చెప్పుకోవచ్చు. పలు గ్రామ సభలో జరిగిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి రెడ్డి, స్పెషల్ ఆఫీసర్, కాసిం బేక్, డిప్యూటీ ఎమ్మార్వో విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.