శివంపేట్ జనవరి 6 సిరి న్యూస్ : శివంపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పనులపై స్పెషల్ ఆఫీసర్ కమలాద్రి చారి ఆదేశం మేరకు గ్రామ కార్యదర్శి రమాదేవి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన , చేపట్టబోయే పనులపై చర్చించారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో నీటి సమస్య రాకుండా చూడాలని గ్రామస్తులు గ్రామసభలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, స్థానిక మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రాజిపేట పద్మా వెంకటేశ్వర్ ముదిరాజ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు ముద్ద గళ్ళ లక్ష్మీనరసయ్య ముదిరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారాల గణేష్, మాజీ వార్డు సభ్యులు, బాసంపల్లి పోచ గౌడ్, కమలయ్య గారి లక్ష్మీనారాయణ, వంజరి కొండల్,గ్రామ తెరాస సీనియర్ నాయకులు బాసంపల్లి రామా గౌడ్, పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు ముద్దగల రాజు ముదిరాజ్, గ్రామపంచాయతీ కారోబార్ భాస్కర్, మరియు పారిశుద్ధ కార్మికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు గ్రామసభలో పాల్గొన్నారు.