నారాయణఖేడ్: ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రమేష్.కు వినతి పత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్ రాజ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ హౌస్ కీపింగ్ పేషెంట్ కేర్ సిబ్బందికి నాలుగు నెలల వేతనాలు చెల్లించకపోవడం వలన కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వీరందరికీ వెంటనే వేతనాలు చెల్లించాలని బుధవారం నాడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని లేనియెడల రేపటినుండి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించరు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి, ఆనంద్, భాగయ్య, అశోక్, కార్మికులు భారతి, ఎలీషా, సుజాత, లక్ష్మి, యశోద, కవిత, ప్రారమ్మ, రాములు, బాలమ్మ, విట్టల్ తదితరులు పాలుగోన్నారు.