విద్య వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట – నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్ద శంకరంపేట, (సిరి న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని బుజరాన్ పల్లిలో సీసీ రోడ్డులకు శంకుస్థాపన, పెద్ద శంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన అంబులెన్స్ ను, ప్రారంభించడం తోపాటు.. ఉత్తులూరులో పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్డులను తనిఖీ చేసిన అనంతరం రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత నిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం మౌలిక వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అన్ని రంగాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ గ్రేసీ బాయ్, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, మండల విద్యాధికారి వెంకటేశం, పేట మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుసుల భవాని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయిని మధు, నాయకులు నారా గౌడ్, దాచ సంగమేశ్వర్, గంగారెడ్డి, హరికిషన్, కుంట్ల రాములు, విట్టల్, అనంతరావు, అంజిరెడ్డి, భాను గౌడ్, ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.