విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి – అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్

– మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
– టెన్త్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి స్టడీ మెటీరియల్ పంపిణి

అమీన్‌పూర్ , జనవరి 04 (సిరి న్యూస్) : విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి (Aminpur Municipal Chairman Tummala Panduranga Reddy) అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు వి ఫర్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి చేతుల మీదుగా పరీక్షా సామాగ్రి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం, యూనిఫాం నోట్ పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదవాలని ఆకాంక్షించారు. వి ఫర్ యు సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణ కల్పన ఉపేందర్ రెడ్డి చంద్రకళ గోపాల్ కో ఆప్షన్ సభ్యులు రాములు నాయకులు యాదగిరి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.