ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న “ఖేడ్” ఎమ్మెల్యే
నారాయణఖేడ్ జనవరి 23 (సిరి న్యూస్) : మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామ పంచాయతీ లో గురువారం ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ఒక్క పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. గత పది సంవత్సరాల నుండి ఏ ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. గత ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు వంటి పథకాలను ప్రజలకు అందివ్వడం జరుగుతోందని అన్నారు. ఈ పథకాలను త్వరలోనే అమలు చేయబోతున్నామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలలో ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుక రావాలని ప్రజలను కోరారు. అనంతరం గ్రామం లోని అంగన్వాడి కేంద్రం లో తానికిచేయడం జరిగింది.కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తహశీల్దార్, ఎంపిడీవో, గ్రామ మస్తులు రమేష్ చౌహాన్,పండరి రెడ్డి,మాణిక్యం, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.