నిరుపేదలకు అందేలా చూడాలి
రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలి
నూతన సంవత్సరంలో అధికారులు పెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి .
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి, జనవరి 2 సిరి న్యూస్ : నూతన సంవత్సరం 2025 లో జిల్లా అధికారులు, ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి కలెక్టర్ వద్ద కు వచ్చిన అధికారుల ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు.
గత సంవత్సరం కంటే అధికారులు మెరుగ్గా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకి అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తెచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా స్థాయి వివిధ శాఖ ల అధికారులు, ఆర్డీవోలు, తాసిల్దారులు, టి ఎన్ జి ఓ నాయకులు, తదితరులు ఉన్నారు.