ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనిఖీ

వెల్దుర్తి ఫిబ్రవరి 6, సిరి న్యూస్: వెల్దుర్తి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత మరియు కుక్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రాధా కిషన్ గురువారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పదవ తరగతి విద్యార్థులకు జరుగుతున్న క్లాసులను అయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దాలని తెలిపారు.అదేవిధంగా పదో తరగతి ఫిజిక్స్ క్లాస్ రూమ్ లో విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి ఆయన సమాధానాలు రాబట్టారు.మొత్తం మీద వచ్చే పదవ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఉదయం సాయంత్రం వేళలో జరుగుతున్న స్పెషల్ క్లాసులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం స్నాక్స్ అందజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరికల యాదగిరి ఎంఈఓ అరికల యాదగిరి, కుకునూరు పాఠశాల హెచ్ ఓ డి సీతారాం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.