పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభాకర్ తనయుడు సాయినాథ్
సంగారెడ్డి, జనవరి 6 సిరి న్యూస్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర స్వామి రథమహోత్సవంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పాల్గొన్నారు .సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి, వైకుంఠపురం ఆలయం వరకు రథోత్సవం కొనసాగుతుంది.. మహిళల కోలాటం, నృత్యాలు, వివిధ దేవత రూపంలో వేషధారణ ప్రత్యేక ఆకాశనీయంగా నిలిచాయి.రథ మహోత్సవంలో పాల్గొన్న చింతా సాయినాథ్, ప్రత్యేక పూజలు నిర్వహించారు .. ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆశీర్వచనాలను అందజేసి ప్రసాదాన్ని అందజేశారు.