మెదక్ జిల్లాలోని శ్రీ సరస్వతి దేవాలయం పవిత్ర పుణ్య క్షేత్రంగా భక్తులను ఆహ్వానిస్తోంది. అక్కడ స్నానమాచరణ, విభూతి ధరించడం, గోమాత సేవ, మరియు శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం, పూజా కార్యక్రమాలు అందుబాటులో ఉండడం, మరియు దేవాలయం వ్యవస్థాపకులైన బ్రహ్మశ్రీ దోర్భల రాజమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కూడా అందించడం విశేషం.
శ్రీ సరస్వతి దేవాలయం 23వ వార్షికోత్సవం 30-1-2025 మొదలుకొని 3-2-2025 శ్రీ వసంత పంచమి వరకు జరుపబడును భగవత్ భక్తులందరూ కూడా 3-2-2025 తేదీ శ్రీ వసంత పంచమి శ్రీ సరస్వతీ మాత జన్మ నక్షత్రము మన యొక్క పేరూరు సరస్వతీ దేవాలయం 23వ వార్షికోత్సవము రోజున ఉదయము అమ్మవారికి అభిషేకము,అలంకారము చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసములు శ్రీ సరస్వతీ మాత యజ్ఞము మహా ప్రసాద వితరణ సాయంత్రము వివిధ గ్రామాలచే షకటబ్రమణోత్సవము బండ్లు తిరుగుట కార్యక్రమం జరుపబడును. కావున అందరూ ఆహ్వానితులే సర్వేజనా సుఖినోభవంతు ఇట్లు శ్రీ సరస్వతి దేవాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దోర్పల రాజమౌళి శర్మ శ్రీదేవి ఉపాసకులు. అంటూ తెలిపారు.