సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఐసీసీ ఆడిటోరియంలో శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ( మన ఓటు మన హక్కు, ఓటు ఈజ్ యువర్ వాయిస్ ) ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటర్ గా నమోదు చేసుకోవాలని,తమ ఓటు హక్కును ,వినియోగించుకోవాలని సూచించారు.ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు,దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు.18-21 సంవత్సరాల యువత 4 శాతం ఓటర్లుగా నమోదై ఉండాలని జనాభా లెక్కలు చెబుతున్నాయని అన్నారు .భారత ఎన్నికలసంఘం , జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని 25 జనవరి 2011 లో జరుపుకోవడం ప్రారంభించి నేటికీ 15 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు .
పార్లమెంట్ ,శాసనసభ ,శాసన మండలి ఎన్నికలలో మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు . పాలసీ మేకింగ్‌లో మీ వంతు పాత్ర ఉండాలంటే , ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయంలో కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా పేర్కొంటూ, అందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని అవగాహన పెంపొందించి, తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. కొత్త ఓటర్ నమోదుకు మీ పరిధి లోని బూత్ లెవెల్ అధికారి/తహసీల్దార్ కార్యాలయము, ఎన్నికలసంఘం ఆన్లైన్ పోర్టల్ లలో ఫారం 6 ద్వారా నమోదుచేసుకోవచ్చునని తెలిపారు.అనంతరం ఉద్యోగులు ,విద్యార్థులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు .జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 పురస్కరించుకొని వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు .నూతనంగా ఓటర్లుగా నమోదుచేసుకున్నవారికి ఓటర్ గుర్తింపు ( EPIC ) కార్డులను కలెక్టర్ అందించారు .
అంతకుముందు జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 కార్యక్రమం లో భాగంగా సంగారెడ్డి ఐ బి నుండి జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ యువతను తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రేరేపించారు. రాజ్యాంగబద్దంగా భారత ఎన్నికల సంఘం ఏర్పడిందని అన్నారు. తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.ఆ తర్వాత, ర్యాలీలో పాల్గొన్న అందరూ ఓటర్ ప్రమాణం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి , డి ఆర్ ఓ పద్మజారాణి , పిడి డీఆర్డీఏ జ్యోతి , డి ఏ ఓ శివ ప్రసాద , జియం డి ఐ సి తుల్జానాయక్ , ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి , ఏవో పరమేష్ , ఎన్నికల విభాగ సూపరెంటెండెంట్ ఆంథోనీ , వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.