మండలంలోని జీడిపల్లి గ్రామంలో ఆదివారం లబ్ధిదారులకు ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గత నెల 26న గ్రామానికి చెందిన దోమకొండ వెంకటరమణ, అనిత దంపతుల కుటుంబ సభ్యులైన అనంత రాములు, విజయ ప్రసాద్ జ్ఞాపకార్థం తో వారితోపాటు మేడ్చల్ కు చెందిన ఆదిత్య ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ప్రత్యేకంగా పలువురికి కంటి పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలవల్ల కంటి అద్దాలు అవసరం ఉన్నదున ప్రత్యేకంగా తయారు చేసిన కంటి అద్దాలను దాదాపు 100 మంది పైగా కంటి అద్దాలను ఉచితంగా వెంకటరమణ దగ్గరుండి పంపిణీ చేశారు.