సంగారెడ్డి : వైకుంఠ ఏకాదశి పర్వ దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం సంగారెడ్డిలోని వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిబిపాటిల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, కొవ్వూరు సంగమేశ్వర్, బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, అనంత్ రావు కులకర్ణి, రవిశంకర్, శ్రీశైలం యాదవ్, కల్వకుంట్ల యశ్వంత్, సందీప్ తదితరులు ఉన్నారు.