ఝరాసంగం : దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి సంక్రాతి, పౌర్ణమి పురస్కరించుకొని సోమవారం మాజీ ఎంపి బిబి పాటిల్ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పాదాచారణ చేసి గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాజీ ఎంపీ ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కార్యనిర్వాన అధికారి శివరుద్రప్ప పూలమాలశాలవతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.